News August 1, 2024

గండి ఆలయ ఏసీపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సుబ్బయ్యపై, ఆలయ ఛైర్మన్ కావలి కృష్ణతేజ జిల్లా కలెక్టర్ శివశంకర్‌కి ఫిర్యాదు చేశారు. శ్రావణమాస ఉత్సవాలలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల విషయంలో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. గోడ పత్రాలు, ప్రచార పత్రాల్లో ఛైర్మన్, పాలకమండలి సభ్యుల వివరాలు లేకుండా అసిస్టెంట్ కమిషనర్ నిర్వహణ పేరుతో అవమానపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News January 17, 2025

కడప: 23, 24 తేదీల్లో స్పోర్ట్స్ మీట్ – 2025

image

కడప నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఈనెల 23, 24 తేదీల్లో రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్పోర్ట్స్ మీట్ -2025 నిర్వహిస్తున్నట్లు కడప నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ మీట్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వాలీబాల్, రన్నింగ్ రేస్, కబడ్డీ, బాడ్మింటన్ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నెల 21లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలన్నారు.

News January 16, 2025

సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కడప కలెక్టర్

image

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 18న మైదుకూరులో పర్యటించే అవకాశం ఉందని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ డా.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా వివరాలు అందాల్సి ఉందన్నారు.

News January 16, 2025

కడప: ‘అధికారులు పొలాలను పరిశీలించాలి’

image

వ్యవసాయ శాఖ అధికారులు పొలాలు, రైతుల దగ్గరికి వెళ్లడం లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యద ర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మాట్లాడుతూ.. రైతలు సాగు చేసిన పంటలకు సంబంధించిన సలహాలను, సూచనలను అధికారులు ఇవ్వడం లేదన్నారు. దీంతోనే పంటలు పూర్తిగా దెబ్బతిని పోతున్నాయని చెప్పారు. తక్షణమే పొలాలను పరిశీలించాలని కోరారు.