News October 22, 2024
గండేపల్లి: లారీ డ్రైవర్‌కి 12 ఏళ్ల జైలు శిక్ష

గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో ఒక లారీపై 34 మంది ప్రయాణిస్తూ అందులో 16 మంది మరణించడంతో అజాగ్రత్తగా నడపిన లారీ డ్రైవర్‌కి అప్పటి గండేపల్లి ఎస్సై రజనీ కుమార్ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఛార్జ్‌షీట్ దాఖలు వేసినట్లు ప్రస్తుత సీఐ శ్రీనివాస్ తెలిపారు. అయితే సోమవారం ఆ కేసుపై పెద్దాపురం కోర్టు జడ్జి డ్రైవర్‌కి 12 ఏళ్లు జైలు శిక్ష, రూ.12 వేలు జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News February 18, 2026
రాజమండ్రి కోర్టుకి బాంబు బెదిరింపు

తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజమండ్రి, కరీంనగర్, అనంతపురం కోర్టులకు ఈ కాల్స్ రావడంతో పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి ముమ్మరంగా గాలించారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభించకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు.
News February 18, 2026
వయోవృద్ధులకు ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా వయోవృద్ధుల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 21న ధవళేశ్వరంలోని శ్రీ గేదెల నూక రాజు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. వృద్ధులు ఉత్పాదక జీవనం గడిపేలా వర్క్‌షాపులు నిర్వహిస్తామని, జిల్లాలోని వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News February 18, 2026
RJY: టెన్త్ పరీక్షలు రాయబోతున్నారా? ఈ వివరాలు మీ కోసమే!

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే టెన్త్ పరీక్షలకు 24,538 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు డీఈవో కె. వాసుదేవరావు ప్రకటించారు. అందులో 12,555 మంది బాలురు, 11,983 మంది బాలికలు పరీక్షలకు సన్నద్ధంగా ఉన్నారన్నారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.


