News November 19, 2025

గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

image

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News December 12, 2025

NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

image

<>NHIDCL <<>>64 అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com

News December 12, 2025

మాజీ సైనికులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

మాజీ సైనికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ‘స్పర్శ’ కార్యక్రమం ద్వారా మాజీ సైనికులు, వారి వితంతువులకు పింఛను నేరుగా బ్యాంకు ఖాతాలకు చేరుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి, పింఛను అవగాహనకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ సైనికులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన కోరారు.

News December 12, 2025

NTR: గ్యాస్ కనెక్షన్ ఇచ్చి డబ్బులు వసూళ్లు.. జిల్లాలో అధిక ఫిర్యాదులు

image

NTR జిల్లాలో ఉచిత గ్యాస్ పంపిణీ చేసిన తర్వాత లబ్దిదారుల నుంచి రూ.50-రూ.100 వరకు వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయం IVRS కాల్స్‌లో స్పష్టం కాగా.. NTR జిల్లాలో అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియా గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు ఇష్టపూర్వకంగానే వారికి తోచినంత డబ్బులు ఇస్తున్నారని, ఎవరూ డిమాండ్ చేయట్లేదని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు.