News March 8, 2025
గంభీరావుపేట:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన క్యాదరి ముత్తయ్య శుక్రవారం సాయంత్రం దుస్తులు కొనుగోలు చేయడానికి పోతారానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా.. బైక్ అదుపుతప్పడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News November 5, 2025
అమ్రాబాద్: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

అమ్రాబాద్ మండలంలోని వటవర్లపల్లి సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అక్కమహాదేవి మలుపు వద్ద అతివేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులను బయటపడ్డారు. బస్సు రోడ్డుపై అడ్డుగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయినట్లు ప్రయాణికులు తెలిపారు.
News November 5, 2025
కోతుల మధ్య కూర్చుంటే యోగిని ఎవరూ గుర్తించరు: అఖిలేశ్

బిహార్ ప్రచారంలో UP CM యోగి ఆదిత్యనాథ్ ‘మూడు కోతుల’ వ్యాఖ్యలకు SP చీఫ్ అఖిలేశ్ కౌంటరిచ్చారు. ‘ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజలను దారిమళ్లించడానికి BJP 3 కోతుల సిద్ధాంతాన్ని గుర్తుచేసుకుంటోంది. నిజానికి ఆదిత్యనాథ్ కోతుల గుంపులో కూర్చుంటే ఆయనను ఎవరూ గుర్తుపట్టలేరు’ అని ఎద్దేవా చేశారు. రాహుల్, తేజస్వి, అఖిలేశ్‌లను యోగి 3 కోతులతో పోల్చి <<18187731>>విమర్శించిన<<>> విషయం తెలిసిందే.
News November 5, 2025
నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌లో ఉద్యోగాలు

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్( NHSRC) 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, MBA, MBBS, BDS, నర్సింగ్, BHMS, BAMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: nhsrcindia.org/


