News February 5, 2025
గంభీరావుపేట: అర్ధరాత్రి అదుపు తప్పిన కారు
గంభీరావుపేట మండలంలోని మల్లుపల్లి గ్రామం బ్రిడ్జి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణం అని సమీపంలో ఉన్న వారు తెలిపారు. ఈ ఘనటపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!
చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్
గచ్చిబౌలి సిద్దిక్‌నగర్‌లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.