News January 29, 2025
గంభీరావుపేట: కారును ఢీకొన్న బైక్.. దంపతులకు గాయాలు

గంభీరావుపేట మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బైక్ కారును ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాలోతు రమేశ్, రేణా అనే దంపతులు ఎక్స్ఎల్ వాహనంపై మాచారెడ్డికి వెళ్తూ ఎదురుగా వస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన మధు కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు కాగా స్థానికులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 24, 2026
చిన్నారి మృతి కేసులో ముగ్గురి అరెస్ట్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చిన్నారి <<19205888>>మృతికి<<>> కారణమైన నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సర్పంచ్ తుకారాంరెడ్డి సహా మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News February 24, 2026
HYD: విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు ట్రాన్స్‌ఫార్మర్లు

HYDలో ఉష్ణోగ్రతల 33 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్న వేళ విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి పరిధిలో 965, మేడ్చల్ 626, హైదరాబాద్ మెట్రో జోన్ ప్రాంతాల్లో 297 DTRలు ఏర్పాటు చేస్తున్నట్లుగా డిస్కం అధికారులు తెలిపారు. HYDలో 3,500 మెగావాట్లకుపైగా విద్యుత్ డిమాండ్ రికార్డు అవుతుంది.
News February 24, 2026
కర్నూలు WDCWలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

<


