News July 8, 2024
గంభీరావుపేట: ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

గంభీరావుపేట మండలం నర్మాలలో ట్రాక్టర్ నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మాల గ్రామానికి చెందిన దండుగుల శ్రీనివాస్ (45) పొలం వద్ద ట్రాక్టర్‌తో పనులు చేస్తున్నాడు. అదే ట్రాక్టర్‌పై గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పొలంఓడ్డు నుంచి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 2, 2025
చాలా రోజుల తర్వాత కనిపించిన కెప్టెన్

చాలా కాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆదివారం కనిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసి, బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణరావు మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.
News November 2, 2025
KNRలో రేపు భారత వాయుసేనపై అవగాహన సదస్సు

KNR జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో రేపు భారత వాయుసేనపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కమాండింగ్ ఆఫీసర్ షేక్ యాకుబ్ అలీ వాయుసేనలో చేరడం ఎలా, వాయుసేనలో అవకాశాలు ఎలా ఉంటాయి, పరీక్ష విధానం, సిలబస్, పూర్తి సెలక్షన్ వివరాలను అభ్యర్థులకు వివరిస్తారని తెలిపారు. ఉ.9 గం.ల నుంచి మ.12 గం.ల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.
News November 2, 2025
HZB: ‘లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా నిషేధం’

హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య, సౌకర్యాలను పరిశీలించి వైద్యులతో చర్చించారు. ఆడపిల్లల పుట్టుకపై తల్లిదండ్రులు ఎలాంటి తారతమ్యాలు చూపరాదని ఆమె సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా నిషేధితమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


