News January 28, 2026
గంభీర్‌ను తీసేయాల్సిందే.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ T20 WC గెలవకపోతే ఆయన్ను తప్పించాలని BCCIకి సూచించారు. కేవలం IPL విజయాల ఆధారంగా ఆయన్ను కోచ్‌గా నియమించడం సరికాదని విమర్శించారు. గంభీర్ స్థానంలో VVS లక్ష్మణ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. అపారమైన కోచింగ్ అనుభవం ఉన్న ఆయన జట్టుకు మెరుగైన ఫలితాలను అందిస్తారని అభిప్రాయపడ్డారు.
Similar News
News February 11, 2026
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.
News February 11, 2026
DRDOలో 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 11, 2026
అష్టమ శనితో వివాహం ఆలస్యం!

జాతకంలో ఎనిమిదో స్థానంలో శని సంచరిస్తే పెళ్లి సంబంధాలు ఆగిపోతాయని అంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో రోజూ ‘హనుమాన్ చాలీసా’ పఠించాలి. అది రక్షణ కవచంలా పనిచేస్తుంది. నువ్వుల నూనెతో శనైశ్చరుడికి అభిషేకం చేయాలి. కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టాలి. వికలాంగులకు సాయం చేస్తే శని ప్రభావం తగ్గి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఓర్పుతో చేసే దైవ ప్రార్థన వివాహ మార్గంలోని ముళ్లను తొలగిస్తుంది.


