News December 28, 2025
గచ్చిబౌలికి గుడ్ బై.. ‘ఫ్యూచర్’ ఈ ఏరియాలదే!

మూసీ ప్రక్షాళన ప్లాన్‌లో భాగంగా ఉప్పల్, బాపుఘాట్ ఏరియాలు హాట్ కేకుల్లా మారబోతున్నాయి. 50-60 అంతస్తుల బిల్డింగ్స్‌కు ప్రభుత్వం రూట్ క్లియర్ చేస్తోంది. అసలు పాయింట్ ఏంటంటే.. పూర్తి స్థాయి డీపీఆర్ (DPR) ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా, తెర వెనుక పని జోరుగా సాగుతోంది. రూ.400 కోట్లతో బ్రిడ్జ్-కమ్-బ్యారేజ్‌ల ప్లాన్ దాదాపు ఖరారైంది. ఇందుకోసం నిధుల సర్దుబాటు, గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతోంది.
Similar News
News February 21, 2026
ఖమ్మం: అడవిని తలపిస్తున్న క్రీడా ప్రాంగణాలు

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లక్షలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ వీటిని ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మైదానాలో చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.
News February 21, 2026
NTR: లంచం కొట్టు.. ఆ తర్వాతే పన్ను కట్టు!

విజయవాడ కార్పొరేషన్‌లో పన్నులు చెల్లించాలన్నా లంచాలు సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఖాళీ స్థలం, ఇంటి మ్యుటేషన్ పన్నుల కోసం వచ్చే వారిని RIలు వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని వంకలు పెడుతూ, VROలను కలిసి ‘రేటు’ మాట్లాడుకోవాలని పంపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఫైలుకు రూ.15వేల-రూ.25వేలు వసూలు చేస్తున్నారని, కమిషనర్ స్పందించి లంచాలని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News February 21, 2026
అమలాపురంలో వ్యభిచారం.. 11 మంది అరెస్ట్

అమలాపురం గోల్డ్ మార్కెట్‌లోని ఒక లాడ్జిలో సాగుతున్న వ్యభిచారంపై CI వీరబాబు ఆధ్వర్యంలో SIలు దాడి చేశారు. ఈ ఘటనలో కొత్తమూరుకు చెందిన రాంబాబు, ఈదరపల్లికి చెందిన నాగేశ్వరరావులను నిర్వాహకులుగా గుర్తించి, అరెస్ట్ చేసినట్లు CI తెలిపారు. వీరితో పాటు 8 మంది విటులు, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


