News February 14, 2025
గచ్చిబౌలిలో ఏసీబీకి పట్టుబడ్డ ఏడీఈ

గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ACB అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ కుమార్ పట్టుబడ్డారు. ట్రాన్స్ఫార్మర్ మంజూరుకు రూ.75వేలు డిమాండ్ చేశారు. వినియోగదారుల నుంచి ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్నారు. కాగా, ఈరోజు మరో రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ACB అధికారులు పట్టుకున్నారు.
Similar News
News October 22, 2025
BELలో 47 పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) బెంగళూరు 67 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, బీటెక్, BSc(ఇంజినీరింగ్), ME, ఎంటెక్, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.150. SC, ST, PWBDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://bel-india.in/
News October 22, 2025
MDK: గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకీ దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఇన్చార్జి డీసీవో పద్మావతి తెలిపారు. రామాయంపేట, కొల్చారం ఎస్సీ గురుకులాల్లో 2025-26 ఏడాదికి 5 నుంచి 9 తరగతులలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 25న డ్రా పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు.
News October 22, 2025
ప్రభుత్వ బడుల్లో నేటి నుంచి ఆధార్ నవీకరణ శిబిరాలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ వివరాల మార్పు, నవీకరణ కోసం నేటి నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,55,780 మంది విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 95,251 మంది, కృష్ణా జిల్లాలో 60,529 మంది ఉన్నారు. పిల్లల వివరాలు సరిచేయడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.