News January 18, 2026

గచ్చిబౌలిలో కనువిందు చేసిన డ్రోన్‌ ఫెస్టివల్

image

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘డ్రోన్ ఫెస్టివల్ 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఈ డ్రోన్‌ షోలో రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, పాలపిట్ట వంటి తెలంగాణ చిహ్నాలను ప్రదర్శించారు. ఆకాశంలో డ్రోన్లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.

Similar News

News April 20, 2026

కొడంగల్‌: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

image

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.