News February 6, 2025

గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)

image

గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రంజిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.

Similar News

News February 6, 2025

పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

image

పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.

News February 6, 2025

తీన్మార్ మల్లన్నపై మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

image

కాంగ్రెస్‌కి చెందిన MLC తీన్మార్ మల్లన్నపై కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ఫిర్యాదు చేశారు. రెడ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను MLC పదవికి అనర్హుడిగా ప్రకటించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు.

News February 6, 2025

సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం

image

సికింద్రాబాద్‌ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్‌ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!