News February 2, 2025
గచ్చిబౌలిలో గన్‌ఫైర్.. కానిస్టేబుల్‌ను పరామర్శించిన సీపీ మహంతి
గచ్చిబౌలిలో కాల్పుల్లో గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వెంకట్ రెడ్డి మాదాపూర్ సీసీఎస్‌లో పని చేస్తున్నాడని, ఆయన స్వగ్రామం శంకర్‌పల్లి సింగపూర్ మండలం. ప్రస్తుతం ఆయన కాలికి గాయమైందని, భయపడాల్సిన పని లేదని వైద్యులు తెలిపినట్లు సీపీ వెల్లడించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
Similar News
News February 2, 2025
ప్రభాకర్‌ను విచారిస్తున్న పోలీసులు (UPDATE)
గచ్చిబౌలిలోని పబ్‌లో పోలీసులపై బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్ నుంచి 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి తుపాకులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌ను సీసీఎస్, క్రైమ్, ఎస్ఓటీ బృందాలు విచారిస్తున్నాయి. ప్రభాకర్‌పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News February 2, 2025
HYD: కాంగ్రెస్ ధర్నాకు తరలిరావాలి: మంత్రి పొన్నం
బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగే భారీ ధర్నాను విజయవంతం చేయలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో నగరంలోని ప్రతి కార్యకర్త పాల్గొనాలన్నారు.
News February 2, 2025
HYD: అప్డేట్ అయిన సిటీ డే పాస్
HYD సిటీ ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ 24 అవర్స్ టికెట్ అప్డేట్ అయింది. QR కోడ్, ఫోన్ నంబర్‌తో పాటు టికెట్ ప్రింట్ వస్తుంది. ఇంతకుముందు QR కోడ్ లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు చెల్లని డే పాస్‌లతో ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు కండక్టర్‌లు గుర్తించడం కష్టంగా ఉండేది. ఫోన్ నంబర్, QR కోడ్ ఉండడంతో నకిలీ టికెట్లు గుర్తించడం తేలిక అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.