News February 13, 2026

గచ్చిబౌలిలో నోట్ల కట్టలతో పారిపోయాడు!

image

గచ్చిబౌలిలో పట్టపగలే నగదు చోరీ జరిగింది. గోపన్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సీఎంఎస్ వాహన డ్రైవర్ అజిత్ అలియాస్ శివ రూ.57 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. కస్టోడియన్లు బ్యాంక్‌లో ఉండగా సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లిన సమయం చూసి చోరీ చేశాడు. వాహనాన్ని తెల్లాపూర్ వద్ద వదిలేసి నగదుతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News February 14, 2026

కవలలకు పేర్లు.. రామ్ చరణ్ దంపతులకు చిరు ప్రశంసలు

image

కవలలకు అన్వీరా దేవి, శివరామ్ అనే పేర్లు పెట్టడంపై రామ్ చరణ్-ఉపాసనను చిరంజీవి అభినందించారు. ఈ పేర్లు ఎంతో బాగున్నాయంటూ బంధువులు, స్నేహితులు, అభిమానుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ‘‘సంస్కృతి, ఆధ్యాత్మికతను మేళవించేలా పేర్లు ఉన్నాయి. చరణ్ తన నానమ్మ అంజనా దేవి పేరు నుంచి ‘దేవి’ని అన్వీరాలో జత చేయడం నా హృదయాన్ని తాకింది. దేవుడి ఆశీర్వాదాలు మీపై ఎప్పటికీ ఉంటాయి’’ అని SMలో పోస్టు చేశారు.

News February 14, 2026

జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి పంతం నెగ్గిందా..?

image

జగిత్యాల మున్సిపాలిటీ ఫలితాలను చూస్తుంటే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంతం నెగ్గినట్టే కనిపిస్తుంది. మొత్తం 50 సీట్లలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి కేటాయించిన 31 సీట్లలో 14 మాత్రమే గెలుపొందగా, జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చిన 19 సీట్లలో 9 సీట్లు దక్కాయి. కీలకంగా మారిన రెబల్ అభ్యర్థుల్లో 15 మంది గెలవగా, అందులో 8 మంది జీవన్ రెడ్డి వర్గానికి దగ్గరగా ఉన్నవారేనని చర్చ జరుగుతోంది.

News February 14, 2026

T20WC: ఒమన్ ఘోర ఓటమి

image

కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ ఘోర ఓటమి చవిచూసింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 18 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ కలీమ్(50), మిర్జా(46) రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్ 3 వికెట్లు తీశారు. 51 బంతుల్లోనే 10 ఫోర్లు 4 సిక్సులతో 94 పరుగులు చేసిన ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.