News December 9, 2025
గజగజ.. రేపు కూడా చలి తీవ్రత

తెలంగాణలో చలి వణికిస్తోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్‌లో టెంపరేచర్ 6-8 డిగ్రీలకు పడిపోనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను బయటికి తీసుకెళ్లవద్దని సూచిస్తున్నారు.
Similar News
News December 12, 2025
సుదీర్ఘ నిరీక్షణకు తెర.. రేపటి నుంచి ‘డ్రాగన్’ షూటింగ్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌లో 2 వారాల షూటింగ్ తర్వాత 6నెలలు గ్యాప్ ఇచ్చిన మేకర్స్ రేపటి నుంచి చిత్రీకరణలో బిజీ కానున్నారు. మూడు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కీలక సీన్లు, సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. రెండు పార్టుల షూటింగ్‌ను ఒకేసారి పూర్తిచేసి తొలి భాగాన్ని 2026 DECలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
News December 12, 2025
ప్రియాంకకు పార్టీ పగ్గాలివ్వాలి.. సోనియాకు సీనియర్ నేత లెటర్

దేశ, పార్టీ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, పార్టీ లీడర్‌షిప్‌ను ప్రియాంకా గాంధీకి అప్పగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఒడిశా మాజీ MLA మహమ్మద్ మొకియమ్ కోరారు. 83 ఏళ్ల ఖర్గేను AICC ప్రెసిడెంట్‌గా తప్పించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్ సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సచిన్ పైలట్, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, శశి థరూర్ వంటి నేతలతో కోర్ లీడర్‌షిప్ ఏర్పాటు చేయాలని కోరారు.
News December 12, 2025
కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. మిరపకు నల్ల తామర ముప్పు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీని వల్ల మిరప పంటకు నల్ల తామర ముప్పు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పురుగులు మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీంతో ఆకులు, కాయలు రాలిపోతాయి. మొక్క పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుల వృద్ధి ఎక్కువ. ఆకు ముడత వ్యాప్తికి నల్ల తామర పురుగులు వాహకాలుగా పనిచేస్తాయి.


