News February 19, 2025

గజపతినగరంలో వ్యక్తి అరెస్టు

image

ఓ చిట్ ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. విజయనగరంలోని ఓ ట్రాన్స్ పోర్ట్ చిట్ ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయిరామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించకపోవడంతో విజయనగరం సివిల్ కోర్టు ఆదేశాల మేరకు సాయిరాంను అరెస్టు చేసి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు.

Similar News

News February 21, 2025

రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా టాప్

image

ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాలు, వివిధ శాఖల ద్వారా అందుతున్న సేవలపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మద్యం షాపుల నిర్వహణలో జిల్లాకు మొదటి ర్యాంక్ లభించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం తెలిపారు. మద్యం షాపుల నిర్వహణలో ప్రజల్లో సంతృప్తి శాతం అధికంగా ఉన్న జిల్లాల్లో విజయనగరం మొదటి స్థానంలో ఉందన్నారు. నాణ్యమైన మద్యం, మంచి బ్రాండ్ లు, MRP అంశాలపై ర్యాంక్ ప్రకటించామన్నారు.

News February 20, 2025

రాజాం: జగన్ రాక.. హెలిప్యాడ్ స్థల పరిశీలన

image

నేడు పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పాలకొండ పట్టణానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి హెలిప్యాడ్ స్థలాన్ని పాలవలస ధవళేశ్వరరావు, రాజాం నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ డా. తలే.రాజేశ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News February 19, 2025

విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా కె.అప్పలరాజు

image

విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా కె.అప్పలరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ అప్పలరాజు మాట్లాడుతూ.. కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో, తోటి సిబ్బంది సమన్వయంతో నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా ఆదాయ రాబడిపై దృష్టి సారిస్తానని, పన్ను వసూళ్లు లక్ష్యాలను అధిగమించే దిశగా పని చేస్తానన్నారు.

error: Content is protected !!