News March 25, 2025
గజ్వేల్ అంటే అభిమానం.. అభివృద్ధికి సహకరిస్తా: సీఎం

గజ్వేల్ నియోజకవర్గం పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందని గజ్వేల్ అభివృద్ధికి సహకరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాదయాత్రగా వెళ్లి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ శాసనసభకు రాకపోవడంతో నియోజకవర్గ సమస్యలు సభలో ప్రస్తావనకు రావట్లేదని సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. ఈవిషయం తన దగ్గరికి వచ్చిన వీడియోను సీఎం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజల సంక్షేమం ముఖ్యమన్నారు.
Similar News
News February 20, 2026
NLG: గంజాయి మత్తు.. తండ్రిని చంపిన కొడుకు!

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంలో నిన్న రాత్రి ఘోరం జరిగింది. గంజాయి మత్తులో ఓ కిరాతక కొడుకు కన్నతండ్రినే కడతేర్చాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర సత్తయ్య(60), తన కుమారుడు బాలకృష్ణ (34) మధ్య కుటుంబ విషయాల్లో తగాదా మొదలైంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలకృష్ణ మత్తులో విచక్షణ కోల్పోయి తండ్రిని కర్రతో బాదాడు. తలకు తీవ్ర గాయమై సత్తయ్య ప్రాణాలు వదిలాడు.
News February 20, 2026
వరంగల్: ప్రకృతి సైతం తెలంగాణ కోసం..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రకృతి సైతం తన వంతు సహకారాన్ని అందించింది. ఉద్యమంలో భాగంగా పలువురు కవులు, రచయితలు ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతిని జోడిస్తూ తెలంగాణ కోసం అనేక గేయాలను, రచనలను రచించారు. దానిలో భాగంగా తొర్రూరు మండలానికి చెందిన గిద్దె రాంనర్సయ్య ‘కొమ్మలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది.. జై తెలంగాణ అన్నది’ అంటూ ప్రకృతిని, అందులోని వన్యప్రాణులను సైతం మిళితం చేసి పాటలను రచించారు.
News February 20, 2026
WGL: తెలంగాణ కోసం వానమ్మను పిలిచాడు!

తన కవితలతో మానవతా విలువలను ప్రతిబింబించిన సాహిత్య సమరయోథుడు జయరాజు. సామాజిక సమస్యలు, గ్రామీణ జీవితం, మానవ సంబంధాలు ఆయన రచనలకు ప్రేరణగా నిలిచాయి. ‘ఒక్కసారైన వచ్చిపోవే.. వానమ్మ’ అంటూ తెలంగాణ కరవు కాటకాలపై జయరాజు రాసిన పాట ఎందరో గుండెలను తాకింది. ఉద్యమ సమయంలో ఆయన రచనలు చైతన్య భరిత స్వరంగా నిలిచాయి. తెలుగు సాహిత్యంలో ప్రేరణాత్మక వ్యక్తిత్వం కలిగిన జయరాజు ఉమ్మడి WGLకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణం.


