News February 18, 2025

గజ్వేల్: అటవీ భూముల నుంచి త్రిబుల్ ఆర్: కలెక్టర్

image

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు జిల్లాలోని గజ్వేల్, మైలారం గ్రామంలో గల 28 హెక్టార్ల అటవీ భూమిలో నుంచి వెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి తెలిపారు. జిల్లా స్థాయి స్వచ్చంధ సంస్థల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఫారెస్ట్ రైడ్ యాక్ట్‌లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. అలాగే జిల్లాలో గల అటవీ భూమి ఉన్న ప్రాంతాన్ని మొత్తం సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

Similar News

News November 9, 2025

సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి సర్క్యులర్ జారీ

image

సింగ‌రేణి సంస్థలో అంతర్గత అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి యాజమాన్యం స‌ర్క్యుల‌ర్ విడుద‌ల‌ చేసింది. ఈ 2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23, సివిల్‌లో 4, ఈ 1 గ్రేడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్‌లో 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10 నుంచి 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు

News November 9, 2025

ధర్మపురి నర్సన్నకు భారీ ఆదాయం

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల తాకిడీ పెరిగింది. దీంతో అదే మొత్తంలో నర్సన్నకు భారీగా ఆదాయం సమకూరింది. దేవాలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టికెట్ల ద్వారా రూ.2,72,258, ప్రసాదాల ద్వారా రూ.1,95,750, అన్నదానం ద్వారా రూ.57,759.. మొత్తం ఆదాయం రూ.5,25,767 ఆదాయం వచ్చింది. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.

News November 9, 2025

శుభ సమయం (09-11-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ చవితి ఉ.9.54 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర రా.2.23 వరకు
✒ శుభ సమయాలు: ఆరుద్ర శివ పూజలకు మంచిది
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: ఉ.11.40-మ.1.10
✒ అమృత ఘడియలు: సా.4.56-సా.6.26