News December 4, 2025
గజ్వేల్: ‘అట్రాసిటీ కేసుల పట్ల నిర్లక్ష్యం వీడాలి’

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పట్ల పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. గజ్వేల్ అంబేద్కర్ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితుల, సాక్షుల సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించాలని కోరారు.
Similar News
News December 4, 2025
WGL: మొక్కజొన్న క్వింటాకి రూ.2,020

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. మక్కలు బిల్టీకి సోమవారం రూ.1,935, మంగళవారం రూ.1,905, బుధవారం రూ.1,945 ధర వచ్చింది. నేడు రూ.2,020 అయింది. దీంతో మొక్కజొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, క్వింటా పచ్చి పల్లికాయకు నిన్న రూ.5,400 ధర రాగా, నేడు రూ.4,700 అయినట్లు వ్యాపారులు తెలిపారు.
News December 4, 2025
కారంపూడి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

కారంపూడి విద్యుత్ ఏఈ పెద్ద మస్తాన్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కారంపూడికి చెందిన వలీ ఇంజినీరింగ్ వర్క్స్ వారికి అదనపు మీటర్లు కేటాయించడానికి డబ్బులు అడగడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఇవాళ బాధితుడు వలి నుంచి ఏఈ రూ.25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
News December 4, 2025
నైపుణ్య లోటుపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ ప్రశ్న

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్‌సభలో వివరాలు కోరారు. కేవలం 3% మంది కార్మికులకే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతికతల వినియోగ వివరాలు తెలపాలని కోరారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఎఫ్‌ఐసీఎస్‌ఐ ద్వారా చర్యలు తీసుకుంటూ 60 విభాగాల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు.


