News March 23, 2025
గజ్వేల్: అహ్మదీపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొగుట వైపు నుంచి గజ్వేల్ వైపు వస్తున్న లారీ బంజేరుపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 24, 2025
బోరుగడ్డ అనిల్‌కు వచ్చే నెల 4 వరకూ రిమాండ్

బోరుగడ్డ అనిల్‌కు నరసరావు పేట కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించింది. ఫిరంగిపురం పోలీసులు ఈరోజు ఆయన్ను పీటీ వారెంట్‌పై సివిల్ జడ్జి వద్ద హాజరుపరచగా ఆయన రిమాండ్ విధించారు. కాగా అనిల్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
News March 24, 2025
భువనగిరి: పది పరీక్షలకు 10 మంది డుమ్మా

భువనగిరి జిల్లాలో పది పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు DEO సత్యనారాయణ తెలిపారు. మూడవ రోజు ఇంగ్లీషు పరీక్ష 50 పరీక్ష కేంద్రాల్లో జరగగా ఆయన 4, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్ష కేంద్రాలను సందర్శించామన్నారు. మొత్తం 8,618 విద్యార్థులకు 8,608 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 10మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News March 24, 2025
రాత్రి బెడ్ రూమ్‌లో ఇలా చేస్తున్నారా?

నిద్ర పోయే సమయంలో బెడ్ రూమ్‌లోకి దోమలు రాకుండా నివారణ యంత్రాలను వాడుతుంటారు. వీటి వాసనను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే హానికరమైన రసాయనాలతో శ్వాస సంబంధిత వ్యాధులకు ఆస్కారం ఉందంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. వీటికి బదులుగా సహజ ప్రత్యామ్నాయాలు వాడటం, దోమతెరలను ఉపయోగించడం ఉత్తమమని చెబుతున్నారు.