News April 23, 2025
గజ్వేల్: ఎంపికైన ఆర్మీ జవాన్‌కు సన్మానం

గజ్వేల్ ఉచిత కోచింగ్ ద్వారా ఆర్మీకి ఎంపికైన వరుణ్‌ను గజ్వేల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పురుషోత్తం రెడ్డి మంగళవారం రాత్రి సన్మానం చేశారు. ఏసీపీ మాట్లాడుతూ.. గజ్వేల్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆర్మీ రంగంలోకి యువతని ప్రోత్సహించి ఆర్మీలో చేరేలా చూడాలని ఉచిత కోచింగ్ అందిస్తున్న నీల చంద్రంకు సూచించారు.
Similar News
News April 23, 2025
వరంగల్: మూడు రోజులుగా స్థిరంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మూడు రోజులుగా తటస్థంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,560 పలకగా.. మంగళవారం అదే ధర పలికింది. బుధవారం సైతం అదే రూ. 7560 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News April 23, 2025
కామారెడ్డి: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో బిక్కనూర్‌కి చెందిన పూజ (18) సూసైడ్ చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పూజకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువుకుంటోంది. పూజ మృతితో బిక్కనూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 23, 2025
బాపట్ల : ర్యాంకింగ్‌లో మెరుగు.. ఉత్తీర్ణతా శాతంలో తరుగు

ఇవాళ విడుదలైన టెన్త్ ఫలితాలలో బాపట్ల విద్యార్థులు సత్తాచాటారు. గతేడాది 88.19 పాస్ పర్సెంటేజ్‌తో జిల్లా 14 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పాస్ పర్సంటేజీ తగ్గింది. 83.96 శాతంతో 12 వస్థానంలో నిలిచింది.