News December 18, 2025
గజ్వేల్: ఒక్క మండల కేంద్రాన్ని దక్కించుకోని కాంగ్రెస్

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్‌లో అధికార కాంగ్రెస్ ఒక్క మండల కేంద్రాన్ని దక్కించుకోలేకపోయింది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపల్ కాగా, వర్గల్‌లో బీఆర్ఎస్, ములుగు- బీఆర్ఎస్, మర్కూక్- బీఆర్ఎస్, జగదేవపూర్- బీఆర్ఎస్, కుకునూరుపల్లి- బీఆర్ఎస్ దక్కించుకోగా, కొండపాక బీజేపీ ఖాతాలో పోయింది. దీంతో అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలే మిగిలాయి.
Similar News
News December 19, 2025
నెల్లూరు: మాతృవేదన.. తీరేనా.!

నెల్లూరు జిల్లాలో హైరిస్క్ గర్భిణుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 44,536 మంది గర్భిణుల్లో రక్తహీనత, బీపీ వంటి సమస్యలతో 6,235 మందిని ‘హైరిస్క్’గా గుర్తించారు. వీరిపై నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో మరణాలు ఆగడంలేదు. నాలుగేళ్లలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు మృతి చెందారు. జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 19గా నమోదైంది. వైద్యశాఖ దృష్టిసారిస్తేనే ఈ ముప్పును నివారించగలరు.
News December 19, 2025
రామగుండం: ‘సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’

రామగుండం బొగ్గు గని ప్రాజెక్టుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష భరోసా ఇచ్చారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
News December 19, 2025
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్‌తో హోటళ్లకు గిరాకీ

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్‌తో హోటళ్ల బిజినెస్ కళకళలాడుతోంది. వీటివల్ల కొత్త కస్టమర్లను చేరుకోగలుగుతున్నామని 59% ఓనర్లు పేర్కొన్నట్లు NCAER FY23-24 నివేదిక వెల్లడించింది. ‘హోటళ్లకు మొత్తంగా 50.4% కస్టమర్లు పెరిగారు. 52.7% కొత్త మెనూ ఐటమ్స్ యాడ్ అయ్యాయి. ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా హోటళ్లకు వచ్చే షేర్ 29%కి చేరింది. ఎంప్లాయిమెంటు 1.08 మిలియన్ల నుంచి 1.37 మిలియన్లకు పెరిగింది’ అని వివరించింది.


