News March 7, 2025

గజ్వేల్: గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకులుగా బోధన చేసేందుకు ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డా. నిఖత్ అంజుమ్ ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎకనామిక్స్ సబ్జెక్టులో ఒక పోస్టు ఖాళీగా ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు పీజీలో 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీలైతే 50% మార్కులు ఉండాలన్నారు. ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 16, 2026

MBNR: మధ్య తరగతి కుటుంబం నుంచి మేయర్‌ దాకా!

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ అప్పన్నపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గుమాల్ మమత శీను ముదిరాజ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ తొలి మహిళ మేయర్‌గా మమత ఎన్నిక కావడం విశేషం. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి మేయర్‌గా ఎన్నిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 16, 2026

కృష్ణా: తండ్రికి ఆసరాగా వెళ్తూ.. అనంత లోకాలకు!

image

తండ్రికి ఆసరాగా ఉండాలనుకున్న ఆ యువకుడిని జలరూపంలో మృత్యువు కబళించింది. పోరంకికి చెందిన డిగ్రీ విద్యార్థి సత్యనారాయణ, ఆదివారం సెలవు కావడంతో తండ్రితో కలిసి కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతై మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 16, 2026

MBNR: మంత్రి శ్రీహరి ఇలాకా.. ఏకగ్రీవ ఎన్నిక

image

మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గమైన మక్తల్‌లోని 3 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. మక్తల్, ఆత్మకూరు, అమరచింత మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లుగా కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.
✒మక్తల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస, వైస్ ఛైర్ పర్సన్ శైవీ రెడ్డి
✒ఆత్మకూరు ఛైర్ పర్సన్ నాగమణి, వైస్ ఛైర్ పర్సన్‌గా శ్రీనివాసులు
✒అమరచింత ఛైర్‌పర్సన్ జింక సువర్ణ, వైస్ ఛైర్‌పర్సన్‌గా రాధ