News September 21, 2025
గజ్వేల్: డెంగ్యూతో బాలుడి మృతి

డెంగ్యూతో బాలుడు మృతి చెందిన ఘటన గజ్వేల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొడకండ్ల గ్రామానికి చెందిన ఎ.యశ్వంత్(11) డెంగ్యూతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత వారం రోజులుగా హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న యశ్వంత్ శనివారం ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి మరణంతో కుటుంబీకులు తీవ్రంగా దుఃఖిస్తున్నారు.
Similar News
News September 21, 2025
11 రోజుల్లో 11 అవతారాల్లో కనక దుర్గమ్మ

Sep 22 – శ్రీ బాలా త్రిపురసుందరిదేవి
Sep 23 – శ్రీ గాయత్రీ దేవి
Sep 24 – శ్రీ అన్నపూర్ణా దేవి
Sep 25 – శ్రీ కాత్యాయినీ దేవి
Sep 26 – శ్రీ మహా లక్ష్మీదేవి
Sep 27 – శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
Sep 28 – శ్రీ మహా చండీదేవి, Sep 29 – శ్రీ సరస్వతీ దేవి
Sep 30 – శ్రీ దుర్గా దేవి, Oct 1 – శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
Oct 2 – శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం
News September 21, 2025
KNR: NHRC జిల్లా అధికార ప్రతినిధిగా స్వరూప

జాతీయ మానవ హక్కుల కమిటీ(NHRC) కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా జమ్మికుంటకు చెందిన ఇటిక్యాల స్వరూపను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు డా.మొగుళ్ల భద్రయ్య నియామక పత్రం అందించారని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి ప్రణయ్ తెలిపారు. పేదప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వరూప కృతజ్ఞతలు తెలిపారు.
News September 21, 2025
టంగుటూరు: 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకు సీజ్

విజిలెన్స్ అధికారి హేమంత్ కుమార్ శనివారం తెల్లవారుజామున 16 లక్షల విలువైన 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకును అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. పొదిలి నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా జాతీయ రహదారిపై లారీని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులు తీరు మార్చుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.