News May 5, 2024
గజ్వేల్: పడిపోయిన చెట్టు.. రూ.10వేల జరిమానా
గజ్వేల్ పట్టణంలో బైక్ మెకానిక్ షాపు ముందున్న చెట్టు వద్ద మంట పెట్టడంతో చెట్టు మొదలు కాలి పడిపోయింది. దీంతో సదరు వ్యక్తికి మున్సిపల్ సిబ్బంది రూ.10000 జరిమానా విధించారు. చెట్టు పోయిన చోటనే వేరే మొక్కను పెట్టించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లును కొట్టివేస్తే వారిపై చర్యలు తీసుకోబడునని కమిషనర్ గోల్కొండ నర్సయ్య హెచ్చరించారు.
Similar News
News November 27, 2024
రైతులను దగా చేసినందుకు పండుగ చేస్తున్నావా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ అంటూ మూడు రోజుల విజయోత్సవాలు చేస్తున్నావా అని ప్రశ్నించారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నావా అని మండిపడ్డారు.
News November 27, 2024
అల్లాదుర్గంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అల్లాదుర్గం వద్ద హైవే- 161పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బోధన్‌కు చెందిన దేశ్ ముక్ రాజశేఖర్, తండ్రి శివరాజ్, తల్లి లక్ష్మీబాయి, తమ్ముడి భార్య అరుణ, కూతురు అనన్యతో కలిసి కారులో HYD నుంచి బోధన్‌కు వెళ్తున్నారు. అల్లాదుర్గం వద్ద కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీ కొట్టడంతో కారు నడుపుతున్న రాజశేఖర్, తండ్రి శివరాజ్ మృతి చెందారు.
News November 27, 2024
సిద్దిపేట: CPR చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
కానిస్టేబుల్ సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. స్థానికుల సమాచారం.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మండల కేంద్రానికి చెందిన సందీప్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ లింగం వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి తలుపులు పగలగొట్టి సందీప్ రెడ్డి కిందకు దింపాడు. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో CPR చేసి ప్రాణాలు కాపాడారు.