News February 3, 2025

గజ్వేల్: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

image

ప్రేమవిఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండపాకలో జరిగింది. ఎస్ఐ వివరాలు.. కొండపాకకు చెందిన ప్రశాంత్(29) శనివారం రాత్రి బయటకు వెళ్తున్నానని తండ్రి ఎల్లయ్యకు చెప్పి వెళ్లిపోయాడు. ఆదివారం పొలానికి వెళ్లిన ఎల్లయ్యకు ప్రశాంత్ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. ప్రశాంత్ ఫోన్‌ను పరిశీలించగా ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 3, 2025

మేడారంలో బోల్తాపడ్డ వాటర్ ట్యాంక్

image

తాడ్వాయి మండలం మేడారంలో వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ మొక్కలకు నీరు పోసేందుకు తీసుకు వెళ్తుండగా తాడ్వాయి – మేడారంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గజ్జల ఆశయ్య అనే వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం.

News February 3, 2025

BREAKING: తెలుగు నిర్మాత ఆత్మహత్య

image

సినీ నిర్మాత, డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి వచ్చారు. తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 2023లో ఆయన దగ్గర 93 గ్రా. కొకైన్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేశారు.

News February 3, 2025

ట్రంప్ సుంకాలు.. ఆందోళన లేదు: ఆర్థిక మంత్రి నిర్మల

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘సుంకాల గురించి ఎలాంటి ఆందోళనా లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. పరోక్షంగా ప్రభావం ఉండొచ్చు. మా ప్రధాన లక్ష్యం ఆత్మనిర్భరతే’ అని పేర్కొన్నారు.