News April 12, 2024

గజ్వేల్: మరోసారి తెరపైకి RRR అలైన్మెంట్ మార్పు అంశం

image

రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం భూసేకరణకు అధికారులు సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం జరిగింది. మర్కూక్ మండల రైతులు మంత్రి వెంకట్ రెడ్డిని కలవడంతో మరోసారి అలైన్మెంట్ మార్పు అంశం తెరపైకి వచ్చింది. HYD రింగ్ రోడ్డుకు 30KMలోపు RRR ఖరారు చేయడంతో నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మరోసారి మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనికి ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలు సేకరిస్తున్నారు.

Similar News

News September 10, 2025

మెదక్: క్రికెట్ మైదానం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎస్పీ

image

మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటు పనులకు బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో కీలకమన్నారు. పోలీసు శాఖలోని యువ సిబ్బంది ప్రతిభను వెలికితీయడానికి, క్రీడా పోటీలను నిర్వహించేందుకు క్రికెట్ మైదానం ఉపయోగపడుతుందన్నారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News September 10, 2025

మెదక్: చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి జరిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News September 10, 2025

మెదక్: విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

image

చేగుంట మండలం చిటోజిపల్లికి చెందిన తలారి గోవర్ధన్(32) అనే యువ రైతు పొలంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య తలారి స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.