News December 15, 2025

గజ్వేల్: సబ్బుబిళ్లపై సర్దార్ పటేల్ చిత్రం

image

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజు సబ్బుబిళ్లపై ఆయన చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు అర్పించారు. భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు అయిన రామరాజు మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడు, నవ భారత నిర్మాత, ఉక్కు మనిషి, గొప్ప దేశభక్తుడు అని కొనియాడారు.

Similar News

News December 17, 2025

మహబూబ్‌నగర్‌లో 25% ఓటింగ్ నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

News December 17, 2025

పల్నాడు: తస్మాత్ జాగ్రత్త.. క్రిస్మస్, న్యూఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు

image

క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఎస్పీ కృష్ణారావు హెచ్చరించారు. ఆన్‌లైన్ షాపింగ్, గిఫ్ట్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ పేరుతో వచ్చే లింకులు, మెసేజీలు మోసపూరితమైనవి కావచ్చని తెలిపారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని, వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మవొద్దని సూచించారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని చెప్పారు.

News December 17, 2025

RBI 93 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 93 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ, సీఏ, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rbi.org.in/