News June 4, 2024
గజ్వేల్ సెగ్మెంట్‌లో బీజేపీ ఆధిక్యం

గజ్వేల్ అసెంబ్లీ సిగ్మెంట్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. మొదటి రౌండ్‌లో బీజేపీకి 3728 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2749 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్‌కు 2543 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 979 ఓట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయింది.
Similar News
News February 14, 2026
నర్సాపూర్: నాడు 47తో ఓటమి.. నేడు 213తో గెలుపు

గత పురపాలక ఎన్నికల్లో నర్సాపూర్ 10వ వార్డు నుంచి పోటీ చేసి కేవలం 47 ఓట్లతో ఓటమి పాలైన అంతారం సుధీర్ గౌడ్.. ఈసారి పట్టుదలతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 2వ వార్డు బరిలో నిలిచి, బీజేపీ ప్రత్యర్థిపై 213 ఓట్ల మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు. ఓటమికి కుంగిపోకుండా ప్రజాసేవే లక్ష్యంగా పోరాడి గెలవవచ్చని ఆయన నిరూపించారు.
News February 14, 2026
మెదక్: వరుసగా 3వ సారి విజయం

మెదక్ పట్టణం 14వ వార్డులో కౌన్సిలర్‌గా దొంతి లక్ష్మి మూడవసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున, 2020లో స్వతంత్ర అభ్యర్థిగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత 15 సంవత్సరాలుగా తనపై నమ్మకం ఉంచి గెలిపిస్తున్న 14వ వార్డు ప్రజలకు దొంతి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ సహకారంతో అభివృద్ధి చేస్తానన్నారు.
News February 14, 2026
మెదక్: కౌన్సిలర్లుగా వదిన మరదలు

మెదక్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 3వ వార్డు నుంచి కొటాల లలిత విశ్వం, 4వ వార్డు నుంచి ధరిమిశెట్టి స్వరూప బీఆర్‌ఎస్ తరఫున కౌన్సిలర్లుగా గెలుపొందారు. స్వయానా వదిన, మరదలైన వీరిద్దరూ విజయం సాధించడంతో అవుసులపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు.


