News February 7, 2025
గజ్వేల్: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు మరోకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే క్షతగాత్రులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 7, 2025
వికారాబాద్: అప్పుడే మండుతున్న ఎండలు
గత కొన్నిరోజులుగా వికారాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జిల్లాలో 35.2 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పొద్దున, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పగటి పుట ఉష్ణోగ్రతలు సుర్రుమంటున్నాయి.
News February 7, 2025
మాజీ మంత్రి అంబటి ట్వీట్‌కి టీడీపీ నేత బుద్దా రిప్లై
ఎన్టీఆర్: రాష్ట్ర మంత్రుల ర్యాంకులలో 8,9 స్థానాలలో ఉన్న లోకేశ్, పవన్‌లకు అభినందనలు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మాజీ MLC బుద్ధా వెంకన్న శుక్రవారం రిప్లై ఇచ్చారు. 8,9 స్థానాలలో ఉన్న మంత్రులు లోకేశ్, పవన్‌లు 1,2 స్థానాలలోకి రావడానికి కృషిచేస్తున్నారని, మాజీ సీఎం జగన్ మాత్రం 11వ స్థానంలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.
News February 7, 2025
మంత్రి సంధ్యారాణికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?
మొదటిసారి MLAగా గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి చంద్రబాబు క్యాబినేట్‌లో మహిళా& శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20 ర్యాంక్ ఇవ్వగా.. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లి 3వ ర్యాంక్ సాధించారు. మరి సంధ్యారాణి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?