News March 7, 2026

గజ్వేల్: KCRకు ఆహ్వానం

image

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు రావాలని మాజీ సీఎం KCRను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 8 నుంచి జరిగే ఉత్సవాలకు రావాలని కోరారు. అనంతరం స్వామివారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్ రవీందర్, ఈవో రంగాచారి పాల్గొన్నారు.

Similar News

News March 9, 2026

వార్ ఎఫెక్ట్: భారీగా పడిపోతున్న గుడ్లు, అరటి రేట్లు

image

AP: ఇరాన్ వార్ ఎఫెక్టుతో రాష్ట్ర ఎగుమతుల రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గల్ఫ్ దేశాలకు గుడ్లు, రొయ్యలు వంటి ఎగుమతుల్లో 54% వాటా AP, TN, TGలవే. ఇందులో AP వాటానే 20%. అలాగే రాయలసీమ నుంచి అరటి గల్ఫ్‌కు వెళ్తుంటుంది. ఎగుమతులు నిలిచి స్థానికంగా గుడ్డు ధర ₹3కి, అరటి KG ₹10కి పడిపోయాయి. రొయ్యదీ అదే స్థితి. అటు 40% నాన్ బాస్మతి బియ్యం ఎగుమతీ ఆగిపోయింది. 4L టన్నుల బియ్యం పోర్టుల్లో నిలిచిపోయింది.

News March 9, 2026

నంద్యాల జిల్లాలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

నంద్యాల జిల్లాలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా నంద్యాల, బనగానపల్లెలో 37.1°, చాగలమర్రి 36.3°, ఆళ్లగడ్డ 35°, వెలుగోడు 34° డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. మార్చిలోనే 37.1°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

News March 9, 2026

12న ప్రజా ప్రతినిధులకు అవగాహన: మంచిర్యాల కలెక్టర్

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 12 ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలోని గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు అవగాహన కల్పించనున్నారు. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.