News March 12, 2025
గజ్వేల్: KCRని కలిసిన దాసోజు శ్రవణ్

ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా నామినేషన్ అనంతరం స్క్రూటినీ పూర్తిచేసుకున్న డాక్టర్ దాసోజు శ్రవణ్ మంగళవారం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసి, ఆశీర్వాదం తీసుకున్నారు.
Similar News
News October 31, 2025
నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు తెరవాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో పాఠశాలలను శుక్రవారం నుంచి యథావిధిగా తెరవాలని కలక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశించారు. పాఠశాలల శానిటేషన్, క్లోరినేషన్ విషయంలో శ్రద్ద తీసుకొవాలాన్నారు. విద్యార్థుల భద్రతకు టీచర్స్ అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. విద్యార్థులు కాల్వలు, రోడ్డు దాటేతప్పుడు పేరెంట్స్ తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరెంట్ స్తంబాలు, నీటికుంటలు దగ్గరకు విద్యార్థులు వెళ్లకుండా చూడాలన్నారు.
News October 31, 2025
అమలాపురం: విద్యార్థులకు అరుదైన అవకాశం

‘స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషన్ టు ఢిల్లీ’ కార్యక్రమానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారని డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా విద్యార్థినులు ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం అభినందనీయమన్నారు. పైడి కొండల రాజేశ్వరి, రాచకొండ సృజన, జ్ఞానపూర్ణ దేవి దీక్షిత, ఎంహెచ్ఎస్ వి అనూష ఎంపికైన వారిలో ఉన్నారని డీఈవో వెల్లడించారు.
News October 31, 2025
వరల్డ్ కప్‌లో అదరగొట్టిన కడప అమ్మాయి

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో కడప జిల్లా అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి ఆదరగొడుతోంది. ఎర్రగుంట్ల RTPPకి చెందిన ఆమె వరల్డ్ కప్‌లో మొదటి నుంచి రాణిస్తున్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో 2 వికెట్లు తీశారు. అయితే 10 ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. కాగా ఇండియా ఫైనల్‌కి చేరడంలో తనవంతు పాత్ర పోషించడంతో శ్రీచరణిని పలువురు అభినందిస్తున్నారు.


