News September 12, 2025

గట్టు: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..!

image

గట్టు మండలం ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్ శుక్రవారం గట్టు సల్కాపురం గ్రామాల మధ్య పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వ్యాన్‌లో 20 మంది విద్యార్థులు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వ్యాన్ వరి పొలంలో కూరుకుపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు అంటున్నారు.

Similar News

News September 12, 2025

రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా: సజ్జల

image

రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి కోసం చేసిన రూ.లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకువచ్చి అయినా రాజధాని కడితే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ రూ.లక్ష కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృథా చేశారు. వైజాగ్, కర్నూలు, విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చు’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

News September 12, 2025

మా హయాంలో పరిశ్రమలు వెళ్లిపోలేదు: సజ్జల

image

తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా ఇతర పార్టీలు చేసిన అసత్య ప్రచారంగా Way2News కాన్‌క్లేవ్‌లో కొట్టిపారేశారు. లులూ వెళ్లిపోయిందన్న ఆరోపణలు వినిపించాయని చెప్పడంతో అదేమైనా ఉపాధి కల్పించే ఇండస్ట్రీయా అని ప్రశ్నించారు. కొవిడ్ రాకపోయుంటే తాము మరింత మెరుగ్గా పనిచేసేవాళ్లమని, మరింత ఆర్థిక వృద్ధి సాధించేవాళ్లమని చెప్పారు.

News September 12, 2025

KNR: ఆగిన నిధులు.. పారిశుద్ధ్యం వెతలు..!

image

కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా 1216 గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, విద్యుద్దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మున్సిపాలిటీలు, పల్లెల్లో ఫాగింగ్ మెషీన్లున్నా నిరుపయోగంగా మారాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, వైరల్ జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.