News September 12, 2025
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

RGM నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, పనులు ఆలస్యమైతే ఖర్చులు పెరిగి భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. GP భవనాలు, అంగన్వాడీలు, శానిటరీ కాంప్లెక్స్, ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్, పాఠశాల టాయిలెట్స్, R&B రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
Similar News
News September 12, 2025
PHOTOS: వే2న్యూస్ కాన్‌క్లేవ్-2025

AP: నేడు మంగళగిరిలో నిర్వహించిన Way2News కాన్‌క్లేవ్-2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి, పోలవరం, పెట్టుబడులు, మెడికల్ కాలేజీలు ఇలా అనేక అంశాలపై తన విజన్‌ను వివరించారు. అటు వైసీపీ నుంచి సజ్జల, బుగ్గన తమ పాలనలో చేసిన పనులు, ఆలోచనలను పంచుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫొటోస్‌ను పై గ్యాలరీలో చూడొచ్చు.
News September 12, 2025
‘సిరిసిల్లలో రేపు లోకాదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

సిరిసిల్లలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్‌పర్సన్, న్యాయమూర్తి పి.నీరజ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఉ.10.30 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు వారి సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
News September 12, 2025
వరంగల్: బియ్యం నిల్వపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

ఏనుమాముల బియ్యం నిల్వ కేంద్రంలో ముక్కిన బియ్యం, మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని కలిపి ఉంచిన వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన ఆమె, ఈ నిర్లక్ష్యానికి కారణమైన పౌరసరఫరాల డీఎం, ఎం.ఎల్.ఎస్. ఇన్‌ఛార్జిలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.