News December 22, 2025

గడువులోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్

image

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తహశీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని రెండు.నియోజకవర్గాల పురోగతిని గణాంకాల ఆధారంగా సమీక్షించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫొటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

Similar News

News December 31, 2025

వనపర్తిలో మరోసారి ఎన్నికలు.!

image

వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✓ వనపర్తి- 33 వార్డుల్లో 70,416 మంది జనాభా
✓ పెబ్బేరు- 12 వార్డుల్లో 15,602 మంది
✓ కొత్తకోట- 15 వార్డుల్లో 19,042 మంది
✓ ఆత్మకూర్- 10 వార్డుల్లో 15,039 మంది
✓ అమరచింత- 10 వార్డుల్లో 11,225 మంది.
ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.

News December 31, 2025

సెలవు ఎరుగని ‘గురువు’.. ఐదేళ్లుగా నిరంతర విద్యా బోధన

image

అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కుడిపూడి నాగేశ్వరరావు అరుదైన రికార్డు సృష్టించారు. గత ఐదు ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా విధులకు హాజరై వృత్తిపట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారు. దివ్యాంగుడైన ఆయనకు కేటాయించిన ప్రత్యేక సెలవులను కూడా వాడకపోవడం విశేషం. ఆయన నిబద్ధతను గుర్తిస్తూ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ లోకం ప్రత్యేక అభినందనలు తెలుపుతోంది.

News December 31, 2025

2025: గోల్డ్‌ ₹57వేలు, వెండి ₹1.6L పెరిగింది!

image

ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. JANలో 10gల బంగారం ధర ₹78,000 ఉండగా.. డిసెంబర్ 31న ₹1,35,880తో ముగించి ఇన్వెస్టర్లకు దాదాపు 78%(₹57k) లాభాలను అందించింది. అటు కిలో వెండి ధర 2025 ప్రారంభంలో ₹98,000 ఉండగా ప్రస్తుతం ₹2.58 లక్షలకు చేరుకొని 150%(₹160k) పైగా వృద్ధిని నమోదు చేసింది. కొత్త ఏడాదిలో గోల్డ్, సిల్వర్ ధరలెలా ఉంటాయో చూడాలి.