News September 16, 2025

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రజలకు ALLERT

image

భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షం కురుస్తున్నందున ప్రాజెక్ట్ వరద గేట్ల నుంచి నీటిని ఏ క్షణమైన విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి (దిగువకు) పశువులు, గొర్రెలు వెళ్లకుండా రైతులు, గొర్రెకాపరులు జాగ్రత్త వహించాలన్నారు. తగిన సూచనలు చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Similar News

News September 16, 2025

హాస్టళ్ల నిర్మాణం-మరమ్మతులకు నిధులు: CBN

image

AP: SC, ST, BC హాస్టళ్లలో వసతులు మెరుగవ్వాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కేంద్రం నుంచి పావలా వడ్డీ కింద రుణం వస్తుంది. ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా విధానాలను రూపొందించండి. సంక్షేమ హాస్టళ్ల పునర్నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయండి. SC, ST హాస్టళ్లలో చదివే విద్యార్థులు IIT, IIM వంటి సంస్థల్లో సీట్లు సాధించేలా మరింత కృషి చేయాలి’ అని తెలిపారు.

News September 16, 2025

మరింత సులభంగా మూవీ షూటింగ్స్: దిల్ రాజు

image

TG: రాష్ట్రంలో సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ అని ఓ వెబ్ సైట్ రూపొందిస్తోంది. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే వారి మూవీకి కావాల్సిన లొకేషన్లు, అనుమతులు, టెక్నీషియన్లు, HYDతోపాటు రాష్ట్రంలోని హోటళ్లతో పాటు సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్ సైట్ రూపొందిస్తున్నాం’ అని FDC చైర్మన్ దిల్ రాజు తెలిపారు.

News September 16, 2025

ప్రకాశం: ప్రభుత్వ కళాశాలలో వికృతి చేష్టలు.. ఐదుగురిపై వేటు

image

ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు వికృత చేష్టలు చేస్తున్నట్లు విద్యార్థులు అధికారులకు లేఖల రూపంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు ఆర్జేడీ పద్మజ సోమవారం కళాశాలలో విచారణ చేపట్టి నలుగురు అధ్యాపకులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నామన్నారు. బోధనేతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై వేరే కళాశాలకు పంపించామని తెలిపారు.