News January 12, 2026

గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 13, 2026

కానిస్టేబుల్‌ సస్పెండ్.. గెలిచిన భార్య!

image

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్‌ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్‌. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.

News February 13, 2026

తొర్రూర్: 9 వార్డులో మొత్తం 1282 ఓట్లు.. బీఎస్పీకి ఒక్క ఓటు రాలే!

image

తొర్రూర్ మున్సిపాలిటీలోని ​9వ వార్డులో అత్యంత ఉత్కంఠ పోరు నెలకొంది. 9వ వార్డు SC-W రిజర్వ్డ్ అయింది. అయితే, బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కిన్నెర కవిత 451 ఓట్లు సాధించి, కేవలం 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన(438 ఓట్లు)పై విజయం సాధించారు. ​ఈ వార్డులో మొత్తం 1282 ఓటర్లు ఉండగా.. 901 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 12 ఓట్లు రాగా.. బీఎస్పీకి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం.

News February 13, 2026

ఈనెల 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ కింద మెటీరియల్ పేమెంట్లను ఈనెల 15 నాటికి రూ.22.68 కోట్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. రోజుకు సుమారు రూ.7.35 కోట్ల పనులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలవు దినాలైనా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పాత పనులు పూర్తిచేసి పేమెంట్లు క్లియర్ చేయాలన్నారు.