News January 26, 2026
గణతంత్ర దినోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: శ్రీకాకుళం కలెక్టర్

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను ఆయన చదివి వినిపిస్తారు. వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి శకటాలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.
Similar News
News February 17, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤ఎల్.ఎన్ పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోట్లు వచ్చిన ఆనందం
➤మందస: పొక్సో కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
➤ప్రజాదర్బార్ నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే బగ్గు
➤టెక్కలికి ఆయుష్ ఆసుపత్రి మంజూరు: అచ్చెన్న
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 39, కలెక్టర్ గ్రీవెన్స్‌కు 94 వినతులు
➤పలాసలో అక్రమ గ్రావెల్ తరలింపు
News February 16, 2026
ఎల్.ఎన్.పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోటి వచ్చిన ఆనందం

ఎల్.ఎన్.పేట(M) కేంద్రంలో పెద్దకోట గ్రామానికి చెందిన కొంత మంది రైతులు మొక్కజొన్న పొత్తులను ప్రయాణికులకు అమ్ముతున్న దృశ్యం సోమవారం కనిపించింది. కాలానుగుణంగా ఉన్న పంటలను, ఇతర పదార్థాలను ఈ గ్రామం వద్ద బస్సులు ఆగినప్పుడు అమ్మి జీవనోపాధి సాగిస్తారు. బస్సు నడిస్తే పరుగుపెడుతూ..జొన్నపొత్తుల ద్వారా వచ్చే రూ.50లకు రోజంతా కష్టపడి జేబు నిండితే ఆనందంగా ఇంటి బాట పడతారు.
News February 16, 2026
ఆమదాలవలస: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కుద్దిరాం రైల్వే గేట్ సమీపంలో ఇవాళ జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంంతో జీఆర్‌పీ ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలాని చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతునికి 45 ఏళ్లు ఉంటాయని, గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్‌ను ధరించినట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు స్థానిక జీఆర్పీ స్టేషన్ సంప్రదించాలన్నారు. దీనిపై కేసు నమోదైంది.


