News January 24, 2026

గణతంత్ర దినోత్సవ పేరెడ్లో.. ఉదయగిరి కోటకు చోటు

image

77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 26న నెల్లూరు పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో జరిగే శకటాల ప్రదర్శనలో ఉదయగిరి కోటకు మొదటిసారిగా చోటు దక్కనుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఉదయగిరి దుర్గానికి ఇప్పటికైనా గుర్తింపు లభించినందుకు నెల్లూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉదయగిరి వాసులు కోరుతున్నారు.

Similar News

News February 15, 2026

నెల్లూరు: రూ.15 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత

image

మనుబోలు మండలం జాతీయ రహదారిపై కాగితాలు పూర్ క్రాస్ రోడ్ వద్ద విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్‌ఓ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రూ.14.70 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నుంచి చెన్నై వెళ్తున్న లారీలో 700 బస్తాలు (35 టన్నులు) రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా నిఘా వేసి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పోలీసులకు అప్పగించారు.

News February 15, 2026

చంద్రబాబు బడ్జెట్ అంతా మోసం, అబద్ధాలు : కాకాణి

image

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషాదకరమని, ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందన్నారు. వైసీపీ హయాంలో ఐదు సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆమోదయోగంగా ఉందన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం వెనకడుగు వేయకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమన్నారు.

News February 15, 2026

దేశంలో ఎక్కడా లేదు.. శ్రీకాళహస్తిలోనే..!

image

శ్రీకాళహస్తి క్షేత్రంలో అనేక విశేషాలు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ముఖద్వారం, నందీశ్వరుడు, బలిపీఠంతో పాటు దారు ఏకశిలా ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం పైన చిన్న నంది ఉంటుంది. ఇటువంటి దారు ఏకశిలా ధ్వజస్తంభం భారతదేశంలో మరెక్కడా లేదు.