News January 26, 2025

గణతంత్ర వేడుకలకు ముస్తాబైన నెల్లూరు కలెక్టరేట్

image

76వ గణతంత్ర వేడుకలకు నెల్లూరు కలెక్టరేట్ ముస్తాబైంది. త్రివర్ణ పతాక రంగులతో అలంకరించిన విద్యుత్ దీపాలంకరణలతో వెలిగిపోతున్నది. గణతంత్ర వేడుకల సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గిరిజన సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, ఇతర ప్రభుత్వ శాఖల పథకాలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నేడు నెల్లూరులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

Similar News

News November 3, 2025

తుప్పు పడుతున్న సబ్ మిషన్ ప్రాజెక్ట పరికరాలు

image

ఉదయగిరి మండలంలోని గండిపాలెం జలాశయ సమీపంలో సుమారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ టెక్నాలజీ సబ్మిషన్ ప్రాజెక్ట్ మంచినీటి పథక యంత్ర పరికరాలు తుప్పుపడుతున్నాయి. దీంతో ఫ్లోరిన్ రహిత తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రజలు వాటర్ ప్లాంట్లపై ఆధారపడి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్వందించాలని కోరుతున్నారు.

News November 2, 2025

మైపాడు బీచ్‌లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి

image

మైపాడు బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బీచ్‌లో స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హుమయూన్, తాజిన్, ఆదిల్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

image

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.