News January 24, 2026
గణతంత్ర వేడుకల్లో దళనాయకిగా సిమ్రన్ బాలా

జమ్ము కశ్మీర్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పని చేస్తున్న సిమ్రన్ బాలా ఆల్ మేల్ CRPF దళానికి జనవరి 26న జరిగే పరేడ్‌లోనాయకత్వం వహించనున్నారు. ఈ ఘనత పొందిన మొదటి మహిళా అధికారిణి బాలా. 2023 మేలో మొదటి ప్రయత్నంలోనే దేశస్థాయిలో 82వ ర్యాంకును సాధించి CRPFలో చేరారు. పరేడ్ రిహార్సల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన, శిక్షణ, ఫీల్డ్ పోస్టింగ్‌లలో విశిష్ట రికార్డు సొంతం కావడం వల్లే ఈ అవకాశం దక్కింది.
Similar News
News February 18, 2026
వినియోగదారులకు అండగా NCH.. ఫిర్యాదు చేస్తే చాలు!

మీరు కొన్న వస్తువు నచ్చకపోయినా లేదా డబ్బులు తిరిగి రాకపోయినా ఇక ఆందోళన వద్దు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్-1915 (NCH) గత 9 నెలల్లో 79,521 ఫిర్యాదులను పరిష్కరించి, వినియోగదారులకు ఏకంగా ₹52 కోట్లు రిఫండ్ ఇప్పించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ (ఈ-కామర్స్) మోసాలపై వచ్చిన 47,743 ఫిర్యాదులను పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా డిజిటల్ పద్ధతిలోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
News February 18, 2026
మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

AP: ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతిలో MBU వద్ద విద్యార్థి నాయకుల <<19041650>>కిడ్నాప్ కేసులో<<>> అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.
News February 18, 2026
వెంటిలేటర్‌పై సల్మాన్ ఖాన్ తండ్రి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.


