News April 8, 2025
గణనాథుని దర్శించుకున్న డైరెక్టర్ మారుతి

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ దర్శకుడు మారుతి దర్శించుకున్నారు. సోమవారం ఆయన స్వామి వారి దర్శనానికి రాగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. మారుతి ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News February 28, 2026
చిత్తూరు జిల్లాకు రూ.101.30 కోట్ల కేటాయింపు

చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇవాళ పింఛన్ పొందలేని వారికి సోమవారం ఇవ్వనున్నారు.
News February 28, 2026
చిత్తూరు పోలీసులకు అవార్డులు

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికిగాను అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చిత్తూరు అడ్మిన్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ ఎస్ఐ రవి, చిత్తూరు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పలమనేరు అర్బన్ హెడ్ కానిస్టేబుల్ లీలాసుఖ నాయుడు, చిత్తూరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజులు, రాళ్లబూదుగూరు హెడ్ కానిస్టేబుల్ పరమేష్ తదితరులు ఉన్నారు.
News February 27, 2026
CTR: రూ.కోట్లు కొల్లగొట్టి.. ప్రజలకు కుచ్చుటోపి పెట్టి!

చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మొన్న పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


