News March 3, 2025

గణనీయంగా తగ్గిన గంజాయి సాగు: హోం మంత్రి

image

కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా రాష్ట్రంలో గంజాయి సాగు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సోమవారం సమాధానం ఇస్తూ 11,000 ఎకరాల నుంచి గంజాయి సాగు ప్రస్తుతం 100 ఎకరాలకు తగ్గిందన్నారు. గంజాయి సాగును పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నియమించిన ఈగల్ టీం గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 15, 2025

పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.

News December 15, 2025

NTR: ఆలయ సేవలు ఇక వాట్సాప్‌లో

image

ఆలయాలకు సంబంధించిన సేవలను సైతం వాట్సాప్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వాట్సాప్‌లో 9552300009కి hi అని మెసేజ్ పంపి.. దర్శన్ టికెట్లు, ప్రత్యేక పూజలు, రూమ్స్ బుకింగ్ వంటి పలు రకాల టికెట్లను నేరుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దుర్గమ్మ ఆలయంతో పాటు, మరో 21 ఆలయాల్లో ఈ సదుపాయం కల్పించారు.

News December 15, 2025

ధనుర్మాసం ఎందుకంత ప్రత్యేకం?

image

సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే పరమ పవిత్రమైన సంధికాలం. ఇది దేవతలకు రాత్రి చివరి భాగం వంటిది. ఈ మాసంలో సత్త్వగుణం వృద్ధి చెందుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అని చెప్పాడు. ఆధ్యాత్మిక, భౌతిక ఫలాలను పొందడానికి, దైవారాధన చేయడానికి, దానధర్మాలు ఆచరించడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనది.