News February 25, 2026

గణపవరం: టెన్త్ అర్హతతో 200 ఉద్యోగాలకు జాబ్ మేళా

image

గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 26న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.పి.నిర్మల కుమారి చెప్పారు. ఈ మేళాలో జీఎల్, పేటీయం, డెక్కన్ కెమికల్స్‌ తదితర కంపెనీల్లో 200లకు పైగా ఖాళీలు ఉన్నాయని, 2023,24,25,26 సంవత్సరాల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 28 ఏళ్లు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులు 26న (గురువారం) ఉదయం 10 గం.లకు డిగ్రీ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరవ్వలన్నారు.

Similar News

News February 28, 2026

RGM: ‘సమాజం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులే’

image

తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన SIలు నక్క శామ్యూల్, నూనె శ్రీనివాస్, ASI వెంకటేష్ బాబు, హెడ్ కానిస్టేబుళ్లు అలీముద్దీన్, విజయేందర్ రెడ్డి కుటుంబాలను ఆత్మీయంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ పొందిన అధికారులు కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా ఉండాలన్నారు.

News February 28, 2026

KNR: ప్రశాంతంగా ముగిసిన జర్నలిజం పరీక్షలు

image

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో సర్టిఫికేట్ కోర్సు ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ కోర్సు 27వ బ్యాచ్ 6 నెలల పాటు జరిగింది. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. శనివారం జర్నలిజం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కోర్సు కో ఆర్డినేటర్, తెలుగు విభాగం అధ్యక్షులు, అసోసియేట్ ప్రొఫెసర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులకు ఫలితాలు ప్రకటించి, సర్టిఫికెట్స్ అందజేస్తామన్నారు.

News February 28, 2026

WNP: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. అర్హత కలిగిన పాఠశాలలు తమ దరఖాస్తులను మార్చి 25 వరకు ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు డేకం విద్యార్థులకు రూ.28 వేలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42 వేలు చొప్పున చెల్లిస్తుందన్నారు.