News November 10, 2025
గణాంక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో 7వ చిన్న నీటిపారుదల గణాంక వివరాల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సహజ, మానవ నిర్మిత బోరుబావులు, చెరువులు, కుంటలు, కాలువలు తదితర చిన్న నీటిపారుదల వివరాలన్నింటినీ సమగ్రంగా సేకరించాలని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన సూచించారు.
Similar News
News November 10, 2025
80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం: మంత్రి

ఈ వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు.
News November 10, 2025
ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువ మంది మొగ్గు

వడ్డీ ఎంతైనా ఫర్వాలేదు… పెద్దగా హామీ పత్రాల పనిలేకుండా ఇచ్చే ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దీపావళి సీజన్లో ‘పైసాబజార్’ చేపట్టిన సర్వేలో 42% మంది ఈ లోన్లపై ఆసక్తిచూపారు. 25% మంది వడ్డీపై ఆలోచించారు. 80% డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి లోన్లకు ప్రాధాన్యమిచ్చారు. కొత్తగా 41% పర్సనల్ LOANS తీసుకున్నారు. కాగా అనవసర లోన్లు సరికాదని, వాటి వడ్డీలతో కష్టాలే అని EXPERTS సూచిస్తున్నారు.
News November 10, 2025
భీమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

వేములవాడ భీమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో రమాదేవి జ్యోతి వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు భీమేశ్వరాలయం ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదం అందజేశారు.


