News September 5, 2025
గణేశ్, మిలాద్-ఉన్-నబీ భద్రతపై సీపీ సమీక్ష

హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ నగరంలో జరగనున్న గణేశ్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీనియర్ అధికారులు, జోన్ డీసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 5న మిలాద్-ఉన్-నబీ, 6న ప్రధాన గణేశ్ నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్, ఎంజే మార్కెట్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బ్లూ కోర్టు మరియు పెట్రోలింగ్ బృందాలు నిఘాను పెంచాలని ఆదేశించారు.
Similar News
News September 7, 2025
నల్గొండ కలెక్టర్ చొరవ.. భారీగా దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో జాతీయ కుటుంబ సంక్షేమ పథకానికి స్పందన లభిస్తుంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో పెద్ద ఎత్తున బాధిత కుటుంబాలు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10 రోజుల్లోనే 12,740 దరఖాస్తులు వచ్చాయి. పేద కుటుంబాలకు చెందిన ఇంటి పెద్ద మరణిస్తే ఆ ఇంటికి రూ.20వేల తక్షణ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు.
News September 7, 2025
ఖమ్మం: స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లైవ్ చికెన్ kg ధర రూ.160 నుంచి 180 కాగా.. స్కిన్ చికెన్ కేజీ ధర రూ.190 నుంచి రూ.210 మధ్యగా ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ.210 నుంచి రూ.240 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే ఈ వారం స్వల్పంగా ధరలు పెరిగినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు.
News September 7, 2025
గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

గణేష్ నిమజ్జనానికి పక్కడ్బందీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బీబీనగర్లోని పెద్ద చెరువు వద్ద ఏర్పాటుచేసిన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అందరిని సమన్వయం చేస్తూ నిమజ్జన కార్యక్రమాలను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.