News August 22, 2025
గణేశ్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోండి: ఎస్పీ

అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా గణేశ్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ పి.జగదీశ్ తెలిపారు. జిల్లాలో వినాయక ఉత్సవాల అనుమతుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ganeshutsav.net అనే వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాలని సూచించారు. అనుమతి పత్రంలో సూచించిన నిబంధనలను తప్పక పాటించాలన్నారు.
Similar News
News August 22, 2025
బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

శ్రీకృష్ణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల విభాగంలో డైరెక్టర్ జీవి రమణ, కంట్రోలర్ శ్రీరామ్ నాయక్, అసిస్టెంట్ రిజిస్టార్ శంకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలాజీ నాయక్ గురువారం ప్రకటించారు. మొత్తం 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 60 మంది ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు. ఫలితాల కోసం ఎస్కేయూ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
News August 21, 2025
‘అనంతపురం ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు’

ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యే వర్గీయులు తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని, ఆడియో కాల్ ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టమని ఒత్తిడి చేస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ధనుంజయ నాయుడు ఆరోపించారు. దగ్గుబాటి ప్రసాద్ అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని, ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
News August 21, 2025
డీసీఎంఎస్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ

రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కళ్యాణదుర్గంలోని డీసీఎంఎస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. నిల్వ ఉన్న ఎరువులు, రికార్డులు పరిశీలించారు. ఎరువుల పంపిణీలో నిబంధనలు పాటించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.