News August 23, 2025
గణేశ చతుర్థి ఉత్సవాలకు పోలీసుల కీలక సూచనలు

గణేష్ చతుర్థి ఉత్సవాలకు జిల్లా పోలీసు శాఖ కీలక సూచనలు చేశారు. విగ్రహాలను రహదారులకు దూరంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని, తాత్కాలిక సీసీ కెమెరాలు పెట్టాలని, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. మండపాల వద్ద ఇసుక బస్తాలు, డ్రమ్ముల్లో నీరు, అగ్ని ప్రమాద నిరోధిక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News August 23, 2025
రేపు వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సోమిరెడ్డి

గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం భాగంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
News August 23, 2025
ఇక నుంచి ఎవ్వరికి పెరోల్ లేఖ ఇవ్వను: కోటంరెడ్డి

ఇక నుంచి తాను ఎవరికీ పెరోల్ కోసం లేఖలు ఇవ్వనని MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. తాను, గూడూరు MLA సునీల్ ఇచ్చిన లేఖలను హోమ్ శాఖ తిరస్కరించిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య సైతం లేఖలు ఇచ్చారని వాటితోనే శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
News August 23, 2025
విశాఖ సెంట్రల్ జైలుకు శ్రీకాంత్ తరలింపు

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్‌ను అధికారులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. భద్రతా కారణాలు దృష్ట్యా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఉదయం 6:30 సమయంలో విశాఖ జైలుకు అతను చేరుకున్నాడు. పెరోల్ రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతన్ని వేరే జైలుకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అతన్ని విశాఖ తరలించారు.