News January 2, 2026
గణేష్‌పాడు: సరిహద్దులో తెలంగాణ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా

ఆంధ్రా శివారు గణేష్‌పాడు సమీపంలో స్కూల్ బస్ బోల్తా పడింది. మొద్దులగూడెం వివేకానంద విద్యా నిలయంకు చెందిన బస్సులో ప్రమాద సమయంలో 120కి పైగా విద్యార్థులు ఉన్నారు. బస్సు పూర్తిగా పల్టీ కొట్టడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరువూరులోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News January 6, 2026
ఈనెల 9లోగా అభ్యంతరాలు అందించాలి: ASF కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల వారిగా ఓటరు జాబితాపై ఈ నెల 9వ తేదీ లోగా అభ్యంతరాలు అందించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల విషయంలో అభ్యంతరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News January 6, 2026
ఆధార్ PVC కార్డు ధర పెంచిన UIDAI

ఆధార్ PVC కార్డు ధరలు పెంచినట్టు UIDAI తెలిపింది. మైఆధార్ పోర్టల్/maadhaar మొబైల్ యాప్ నుంచి అప్లై చేసుకునే యూజర్ల నుంచి ట్యాక్స్‌లతో కలిపి రూ.75 వసూలు చేయనున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు రూ.50గా ఉన్న ఛార్జీని పెంచామని, జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయని చెప్పింది. పీవీసీ కార్డు తయారీ, ప్రింట్, డెలివరీ, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిన కారణంగా ఛార్జీలు పెంచినట్టు తెలిపింది.
News January 6, 2026
FLASH: హైదరాబాద్ ఘన విజయం

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బరిలోకి దిగిన HYD జట్టులో ఓపెనర్ అమన్ రావు 200* చెలరేగాడు. రాహుల్ సింగ్ (64), తిలక్ వర్మ (34) రాణించారు. 352 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగాల్ 245 పరుగులకే కుప్పకూలింది. కాగా, తిలక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత HYD వరుసగా 2వ విజయం నమోదు చేయడం విశేషం.


