News September 3, 2024

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాలపై ఏర్పాటు చేసిన ‘శాంతి కమిటీ’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వాడేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News November 17, 2024

భువనగిరి: గ్రూప్-3 పరీక్ష.. యువతికి రోడ్డు ప్రమాదం

image

గ్రూప్ -3 పరీక్ష రాయడానికి వెళ్తున్న యువతికి గాయాలయ్యాయి. సంస్థాన్ నారాయణపురం చెందిన శృతి భువనగిరిలోని వెన్నెల కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్తుండగా అనాజీపురం వద్ద వారి బైక్‌పై ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శృతికి గాయాలయ్యాయి. చికిత్స చేయించుకుని తిరిగి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కాగా సమయం ముగియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెను తిరిగింది.

News November 17, 2024

NLG: సాగు అంచనా @5,83,620 ఎకరాలు!

image

జిల్లాలో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 5,83,620 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అందులో వరి 5,56,920 ఎకరాలు, సజ్జ 150, జొన్న 2,200, వేరుశనగ 21,000, పెసర 2,000, ఆముదం 350, మినుములు 1,000 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది.

News November 17, 2024

NLG: ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ రిలీజ్

image

నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఖాళీగా ఉన్న జిల్లా ప్రోగ్రాం అధికారి పోస్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయుటకు ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను www.nalgonda.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రకటించారని డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలు ఉన్నట్లయితే సోమవారం మధ్యాహ్నం లోగా లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు.